SDPT: మహమ్మదాపూర్ ప్రధాన పంప్ హౌస్ పైప్లైన్ లీకేజీ మరమ్మతుల వల్ల గురువారం నీటి సరఫరాలో అంతరాయం కలగనుంది. దీని ప్రభావంతో హుస్నాబాద్, భీమదేవరపల్లి మండలాల్లోని గ్రామాలకు మిషన్ భగీరథ నీరు నిలిచిపోనుంది. ప్రజలు ముందస్తుగా నీటిని నిల్వ చేసుకోవాలని హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున గౌడ్ కోరారు.