KNR: ఇల్లంతకుంట సీతారామచంద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈరోజు రాత్రి 8 గంటలకి శ్రీ సీతారామచంద్రస్వామి హనుమత్ వాహన సేవ సంధర్భంగా స్వామివారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం స్వామివారిని హనుమత్ వాహన సేవలో మాడా వీధుల్లో గుండా ఊరేగించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కమిటీ నిర్వహకులు తెలిపారు.