మహబూబ్నగర్ జిల్లాలో వేసవి ఎండలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నచింతకుంటలో 41.1°C, కోయిలకొండలో 41.0°C, కౌకుంట్లలో 40.9°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భూత్పూర్, మిడ్జిల్, మహమ్మదాబాద్ మండలాల్లోనూ 40°C పైగా ఉష్ణోగ్రతలతో రహదారులు నిర్మానుష్యంగా మారాయి.