ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత మరింత పెరిగింది. జగిత్యాల జిల్లా రాఘవపేట, ఐలాపూర్లో అత్యధికంగా 43.4°C ఉష్ణోగ్రత నమోదైంది. కరీంనగర్ జిల్లా ఇందుర్తి 42.8, ఏదులగట్టెపల్లిలో 42.5°C, పెద్దపల్లి జిల్లా సుగ్లంపల్లి 42.7, రామగుండం 42.5°C నమోదు కాగా, రాజన్న సిరిసిల్ల జిల్లా, రుద్రంగి, మర్రిగడ్డలో 42.8°C గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.