VKB: జిల్లా బీజేపీ అధ్యక్ష పదవీ భర్తీ కోసం రాష్ట్ర నేతలు స్థానిక హోటల్లో సీనియర్ నాయకుల అభిప్రాయాలను సేకరించారు. గతంలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి పదవి నుంచి తొలగించబడి, కర్ణం ప్రహల్లాద్ రావు కన్వీనర్‌గా నియమితులయ్యారు. కొత్త పోటీలో శివరాజ్, రమేష్ తదితరులు పాల్గొంటున్నారు. అధిష్ఠానం త్వరలో తుది నిర్ణయం తీసుకుంటుందని పార్టీ వర్గాలు పేర్కొన్నారు.