SRPT: కోదాడ మండలంలో జరుగుతున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళికపై కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ గురువారం కోదాడలో సమీక్షించారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో వివిధ శాఖలు చేపట్టిన పనులను ఆయన పరిశీలించి, నిర్ణయించిన పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షా కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దార్ వాజిద్ అలీ తదితరులు పాల్గొన్నారు.