MHBD: గార్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైనట్లు ప్రిన్సిపల్ డి.రాజు శుక్రవారం తెలిపారు. కళాశాలలో బీఏ (తెలుగు, ఇంగ్లీష్), బీకాం (సీఏ), బీఎస్సీ ఫిజికల్ సైన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మొదటి విడత రిజిస్ట్రేషన్ ఈ నెల 15 నుంచి మే 7 వరకు కొనసాగుతుందని తెలిపారు.