CM Revanth Reddy poured diesel on his body in front of his house.. attempted suicide
CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే అతన్ని అడ్డుకున్నారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని ఒంటిపై నీళ్లు పోశారు. ముఖ్యమంత్రి తనకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఆ కోపంతోటే ఇలా చేసినట్లు ఆ వ్యక్తి తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి:Gadwal Vijayalakshmi: కాంగ్రెస్‌లో చేరిన జీహెచ్ఎంసీ మేయర్
బాధితుడి పేరు కృష్ణ సాగర్. అతను భూపాలపల్లికి చెందిన వ్యక్తి అంతేకాదు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నట్లు చెప్పారు. రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పటి నుంచి తెలుసని, ఆయన సీఎం అయిన తరువాత కలవడానికి అవకాశం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారందరికీ ప్రాధాన్యం ఇస్తున్నారు.. తన లాంటి కాంగ్రెస్ కార్యకర్తలకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆత్మహత్యకు పాల్పడ్డట్లు వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాల వైరల్ అవడంతో ఇదేనా ప్రజా పాలనా అంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
చదవండి:CM Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ పక్కా.. బాధ్యులకు శిక్ష తప్పదు
రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని ఆత్మహత్యాయత్నం!
రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పటి నుండి పార్టీలో ఉన్న తనకి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని సీఎం ఇంటి దగ్గర ఓ వ్యక్తి డిజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం.
సీఎం కాకముందు తనతో చాలా సన్నిహితంగా ఉండే వాడని.. ఇప్పుడు తనకు ప్రాధాన్యత… pic.twitter.com/NNrFWMDte6
— Telugu Scribe (@TeluguScribe) March 30, 2024

