NZB: నిత్యం వాహనాలు నడిపే డ్రైవర్లు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ అన్నారు. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా మోపాల్ పోలీస్ ఆధ్వర్యంలో, లయన్స్ క్లబ్, జీజీహెచ్ సహకారంతో మోపాల్లో డ్రైవర్లకు కంటి, చెవి పరీక్షలు శనివారం నిర్వహించారు. భారీ వాహనాలు నడిపే డ్రైవర్లు ఎల్లప్పుడు కంటి, చెవి పరీక్షలు చేయించుకోవాలన్నారు.