నార్త్ అమెరికాలో ‘బాహుబలి’ రికార్డును ‘ధురంధర్ 2’ అధిగమించడంపై రానా దగ్గుబాటి హర్షం వ్యక్తం చేశాడు. ‘ధురంధర్ 2 సాధిస్తున్న రికార్డులు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. దశాబ్ద కాలంగా బాహుబలి పేరిట ఉన్న రికార్డును ఇది సొంతం చేసుకోవడం గొప్ప విషయం. ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలి. ఎన్ని రికార్డులు వచ్చినా, వేటికవే ప్రత్యేకం’ అని అన్నాడు.