ఉమ్మడి HYD, RR జిల్లాలో సూర్య భగవానుడి ప్రతాపం రోజురోజుకు విపరీతంగా పెరుగుతుంది. గరిష్టంగా షాబాద్, మహేశ్వరం ప్రాంతాల్లో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇంకా నేడు, రేపు రెండు రోజుల్లోనే 40 డిగ్రీలకు చేరుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మల్లాపూర్, ఉప్పల్, బాలానగర్, రాజేంద్రనగర్, ఆసిఫ్ నగర్, గోల్కొండ ప్రాంతాల్లో వేడి విపరీతంగా ఉండనున్నట్లు వివరించింది.