NZB: బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం కిసాన్‌నగర్ లోని లయన్స్ భవనంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్య రాజ్ 20 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో మోతి బిందు ఉన్నవారిని గుర్తించి శస్త్ర చికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు.