SRPT: ఇంటర్మీడియట్ ఫలితాల్లో తిరుమలగిరి మండలం నాగారం కేజీబీవీ విద్యార్థినులు అద్భుత ప్రతిభకనబరిచారు. కె.మనీషా 440 మార్కులకు గాను 431 మార్కులు సాధించి సత్తాచాటగా, ఒకేషనల్ విభాగంలో పి.నందిని 454/500 మార్కులతో మెరిసింది. ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుతూ.. కార్పొరేట్ స్థాయి మార్కులు సాధించిన విద్యార్థినులను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఘనంగా అభినందించారు.