KNR: అరైవ్-అలైవ్ రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా 49వ డివిజన్లో సోమవారం రోడ్ సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేశారు. కార్పొరేటర్ ఎన్నం లక్ష్మీ ఛైర్మన్గా, మరో 8 మందిని సభ్యులుగా నియమించారు. అనంతరం కార్యక్రమంలో భాగంగా ప్రజలకు రోడ్ సేఫ్టీ ప్రతిజ్ఞ చేయించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ప్రమాదాల నివారణకు అవగాహన పెంపొందించాలన్నారు.