KNR: శంకరపట్నం మండలం కన్నాపూర్, రాజాపూర్, లింగాపూర్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశాలకు ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులను సత్కరించారు. రాజాపూర్‌లో వైకుంఠ రథాన్ని పంచాయతీకి అందజేశారు. అనంతరం రామలింగేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు.