MBNR: నబాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ మిస్సింగ్ కేసు నమోదు అయినట్లు ఎస్సై విక్రం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. తీగలపల్లికి చెందిన జ్యోతి ఈనెల 14వ తేదీ నుంచి కనిపించకుండా పోయినట్లు ఆమె భర్త వెంకటేష్ ఫిర్యాదు చేసినట్టు SI పేర్కొన్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.