MBNR: వేసవి సెలవులను దొంగతనాల నియంత్రణకు మొదటి ప్రాధాన్యతను ఇస్తామని మహబూబ్ నగర్ ఎస్పీ జానకి అన్నారు. శనివారం ఎస్పీ ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. వేసవి సెలవులలో శుభకార్యాలకు విహారయాత్రలకు వెళ్లేవారు తమకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజలు తమ ఇండ్లలో భారీ మొత్తంలో డబ్బు నగదు ఉంచకూడదని సూచించారు. కొత్త వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.