MDK: పెద్ద శంకరంపేట రేషన్ దుకాణాన్ని తహసీల్దార్ ప్రభుదాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. లబ్ధిదారులకు మూడు నెలలకు సంబంధించిన బియ్యాన్ని సరఫరా చేయాలని సూచించారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రేషన్ బియ్యాన్ని అందించాలని రేషన్ డీలర్లకు సూచించారు. తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, రేషన్ డీలర్ వినోద్, తదితరులు పాల్గొన్నారు.