NRPT: ఉట్కూరు మండలం బిజ్వార్ గ్రామంలో ఉపాధి హామీ నిధుల దుర్వినియోగం కలకలం రేపింది. గ్రామానికి చెందిన కూలీలు ఉపాధి కోసం ముంబైకి వలస వెళ్లిన సమయంలో, వారి పేర్లపై ఫీల్డ్ అసిస్టెంట్ మస్టర్లు వేసి నిధులు కాజేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమాలపై ప్రశ్నిస్తే ఫీల్డ్ అసిస్టెంట్ తమను వేధిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు బుధవారం ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.