AP: ప్రముఖ సింగర్ ఆశాభోస్లే మృతి పట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఆశాభోస్లే మరణ వార్త విని బాధపడ్డా. అత్యధిక పాటలు పాడి చరిత్ర సృష్టించారు. దాదాపు ఏడు దశాబ్దాల పాటు మ్యూజిక్ ఇండస్ట్రీకి సేవలందించారు. భారతీయ సంగీత జగత్తులో ఆమె పాటలు తరతరాలపాటు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఆశా కుటుంబానికి, ఆమె అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని ట్వీట్ చేశారు.