NLG: చండూరు-నల్గొండ రూట్లో బస్సుల కొరతతో ప్రయాణికులు అల్లాడిపోతున్నారు. ఆదివారం ఉదయం 10:30 గంటల బస్సులో ఏకంగా 130 మంది ఎక్కడంతో ఊపిరాడని స్థితి నెలకొంది. కనీసం నిలబడే స్థలం లేక మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డట్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అధికారులు వెంటనే అదనపు సర్వీసులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.