MNCL: లక్షెట్టిపేట సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ పరీక్షలలో 100% ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్ రమ కళ్యాణి తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 74 మంది, ద్వితీయ రెండో సంవత్సరంలో 65 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వారందరూ పాసయ్యారు. మొదటి సంవత్సరం ఎంపీసీలో విద్యార్థిని సాయి త్రిణిత 468/470 మార్కులు సాధించి కళాశాల టాపర్గా నిలిచారు.