NLG: మండలంలోని పలు గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా మారాయి. గత ప్రభుత్వ హయాంలో రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన బోర్డులు చెరువుల దగ్గర, రోడ్ల పక్కన దర్శనమిస్తున్నాయి తప్ప.. ఆడుకోవడానికి ఆటస్థలం మాత్రం లేదు. దీంతో క్రీడాకారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే క్రీడా స్థలాలు కేటాయించాలని యువత కోరుతున్నారు.