NZB: భీమ్‌గల్ మండలాభివృద్ధికి రూ.6.40 కోట్లు మంజూరైనట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఇందులో లింబాద్రి గుట్ట టూరిజం గెస్ట్ హౌస్‌కు రూ.4 కోట్లు, కోర్టు భవన నిర్మాణానికి రూ.33 లక్షలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలకు రూ.1.40 కోట్లు, గోదాంలకు రూ.60 లక్షలు కేటాయించామన్నారు. నిధుల విడుదలకు కృషి చేసిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.