MBNR: దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డిని హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రతినిధులు గురువారం కలిసి అభినందనలు తెలిపారు. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలులోకి రావడంలో ఎమ్మెల్యే పోషించిన కీలక పాత్రను ఈ సందర్భంగా న్యాయవాదులు కొనియాడారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి నేతృత్వంలో ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సత్కరించారు.