NRML: నిర్మల్ పట్టణ కేంద్రంలో ఈరోజు అంబేద్కర్ జిల్లా నాయకులు సీఐకు వినతి పత్రం అందజేశారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు తోపుడు బండ్లు నిలిపివేయడం వల్ల అపరిశుభ్రత పెరిగి విగ్రహం కనబడకపోవడంతో పాటు పాన్, గుట్క విక్రయాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బండ్లు తొలగించి శుభ్రత చర్యలు తీసుకోవాలని వారు కోరారు.