HYD: మూసీ నదిని శుభ్రం చేయకుండానే శివుడి విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభ రెడ్డి పేర్కొన్నారు. మూసీని శుద్ధి చేయకముందే అక్కడ చర్చలు, గురుద్వారాలు, ఆలయాల నిర్మాణానికి పూజలు చేయడం ఏమిటని విమర్శించారు. కాలుష్య నదుల్లో ఇది కూడా ఒకటని.. ముందుగా అభివద్ధి చేపట్టి ఆ తరువాత విగ్రహాలు ఏర్పాటు చేయాలన్నారు.