ASF: జిల్లా కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం జిల్లా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని అధికారులు తెలిపారు. ఉదయం నుంచే ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్న సమయంలో రోడ్లపై రద్దీ తగ్గిపోయింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలన్నారు.