MNCL: లక్షెట్టిపేట తాలుకా పరిధిలోని వివిధ మండల కేంద్రాలలో రోడ్లపై సంచరిస్తున్న మూగజీవాలు దప్పికతో విలవిలాడుతున్నాయి. దండేపల్లి, లక్షెట్టిపేట, జన్నారం మండలాల్లో ఉన్న ప్రధాన రహదారిపై ఎక్కువగా మూగజీవాలు సంచరిస్తున్నాయి. అయితే ఎండల తీవ్రత 43 డిగ్రీలకు చేరడంతో అవి నీటి కోసం ఇబ్బంది పడుతున్నాయి. మండల కేంద్రాల్లో నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారు.