ASR: ప్రపంచంలోని చాలా క్షేత్రాల్లో నృసింహ రూపం, వరాహ రూపాలు ఉన్నాయి. కానీ ఒక్క సింహాచలంలోనే రెండు రూపాలు కలిగిన స్వామి శాంతస్వరూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అందుకే ఈ క్షేత్రానికి అంత విశిష్టత ఉందని ఆలయ ఆచార్యులు తెలిపారు. ప్రహ్లాదుడు నిర్మించిన ఆలయంగా చెబుతారు. పురూరవ చక్రవర్తి ఈ క్షేత్రాన్ని పునరుద్ధరించాడని ప్రతీతి.