E.G: రాజమండ్రి బూరుగుపూడి ఎయిర్ పోర్ట్‌లో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు సోమవారం టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈయన రాజానగరం నియోజకవర్గాలలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పిన్నమరెడ్డి ఈశ్వరుడు పాల్గొన్నారు.