దిగ్గజ దర్శకుడు భారతీరాజాను నటి రాధిక పరామర్శించిన విషయం తెలిసిందే. అనారోగ్యం నుంచి కోలుకుంటున్న ఆయన్ను కలిసిన వీడియోను ఆమె పంచుకున్నారు. రాధిక నటించిన ‘తాయ్ కిళవి’ సినిమాకు జాతీయ అవార్డు వస్తుందని భారతీరాజా ప్రశంసించారు. తన గురువు ఆశీర్వాదం అన్ని అవార్డుల కన్నా గొప్పదని రాధిక భావోద్వేగానికి లోనయ్యారు. సినిమాపై ఉన్న ప్రేమే ఆయన్ను ముందుకు నడిపిస్తోందని ఆమె పేర్కొన్నారు.