CTR: ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్ల కేడర్ స్ట్రెంత్ జాబితాలను అందజేయాలని డీఈవో రాజేంద్రప్రసాద్ ఎంఈవోలను ఆదేశించారు. టీచర్ల బదిలీలు, ప్రమోషన్ ప్రక్రియకు సంబంధించి సేకరించిన టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డిక్లరేషన్ కాపీలను చిత్తూరు డీఈవో కార్యాలయానికి చేరవేయాలన్నారు. హోదాల వారీగా ప్రత్యేకంగా విభజించాలని తెలిపారు.