GDWL: వడ్డేపల్లిలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంటిని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు రామకృష్ణారెడ్డి, దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు.