PDPL: మంథని నియోజకవర్గంలోని కాటారం మండలం కేంద్రంగా ఈనెల 20న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని తన నివాసంలో కాంగ్రెస్ నాయకులతో సమావేశమై సభ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.