GDWL: కుక్కల దాడితో ఆవు దూడ మృతి చెందిన సంఘటన ఉప్పునుంతల మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. మండల పరిధిలోని కంసాన్పల్లి గ్రామంలో సత్యనారాయణకు చెందిన ఆవు దూడపై ఆదివారం కుక్కలు దాడి చేశాయి. ఆవు దూడ అక్కడికక్కడే మృతి చెందింది. కుక్కల తీవ్రత ఎక్కువైందని గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. నియంత్రణకు పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.