MNCL: జన్నారం మండలంలోని బాదంపల్లి శివారులో ఉన్న గోదావరి తీరంలో నాటు బాంబు పేలుడు కలకలం రేపింది. గోదావరి తీరంలో నాటు బాంబు పేలి నాలుగు గేదెలు తీవ్రంగా గాయపడ్డాయని స్థానికులు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు వన్యప్రాణుల వేట కోసం నాటుబాంబులు అమర్చి ఉంటారని, ఆ క్రమంలో బర్రెలు వాటిని ఆహారంగా భావించి తినే క్రమంలో బాంబులు పేలి ఉంటాయన్న అనుమానం వ్యక్తం చేశారు.