BDK: పాల్వంచ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో సీపీఐలో 80 కుటుంబాలు చేరాయి. సయ్యద్ యాకుబ్ అమీర్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా పాల్గొని కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఐ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.