MNCL: ప్రయాణాల్లో తప్పనిసరిగా హెల్మెట్, సీటు బెల్టు ధరించాలని సీఐ ప్రమోద్ రావు సూచించారు. మంచిర్యాల జడ్పీ బాలుర పాఠశాల వద్ద శనివారం ‘అలైవ్-అరైవ్’ కార్యక్రమం నిర్వహించారు. ప్రమాదాల వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు.