NZB: బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో స్థానిక ఆజం గంజ్ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి విద్యా ప్రమాణాలను పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో 3వ తరగతి విద్యార్థులను పిలిచి తెలుగు, ఇంగ్లీష్ చదివించగా వారు సరిగ్గా చదవలేకపోయారు. దీంతో ఉపాధ్యాయులపై సబ్ కలెక్టర్ మండిపడ్డారు.