MNCL: మంచిర్యాల పట్టణం కాకతీయ కాలనీకి చెందిన రజితకు మంగళవారం పురిటినొప్పులు రావడంతో 108 సిబ్బంది స్పందించారు. EMT లక్ష్మయ్య ఘటనా స్థలానికి చేరుకోగా, నొప్పులు అధికమవడంతో వైద్యుల సూచన మేరకు ఇంటి వద్దే ప్రసవం చేశారు. రజిత మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డలను మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల మాతా శిశు ఆసుపత్రికి తరలించినట్లు 108 సిబ్బంది తెలిపారు.