SRPT: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవ్వాళ హుజూర్నగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి బయలుదేరి 9 గంటలకు హుజూర్నగర్ చేరుకుని రామస్వామి గుట్ట వద్ద నిర్మాణంలో ఉన్న హౌజింగ్ కాలనీని పరిశీలించనున్నారు. అనంతరం చింతలపాలెం మండలం దొండపాడు, పాలకవీడు మండలం జాన్పహాడ్లోని లిఫ్ట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.