SDPT: జిల్లాలోని NGO భవన్లో ఈనెల 21న మిల్లెట్స్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు మున్సిపల్ ఛైర్ పర్సన్ మంజుల తెలిపారు. గురువారం దీనికి సంబంధించిన వాల్ పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. వ్యాస మహర్షి యోగ సొసైటీ, NGO భవన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయన్నారు. కాలుష్యాన్ని తట్టుకొని ఆరోగ్యంగా ఉండాలంటే పోషక విలువలున్న చిరుధాన్యాల ఆహారం ఎంతో అవసరమన్నరు.