SDPT: సిద్దిపేట కోటిలింగాల ఆలయంలో నిర్వహించిన హిందూ సమ్మేళనంలో హిందూ వాహిని అఖిలభారత సంయోజక్ దేవేందర్ జీ. ముఖ్య వక్తగా ప్రసంగించారు. జాతీయ పునర్నిర్మాణం ఆర్ఎస్ఎస్ శాఖల ద్వారానే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. వందల ఏళ్ల బానిసత్వం తర్వాత, డాక్టర్ హెడ్గేవార్ 1925లో సంఘాన్ని స్థాపించిన నేపథ్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో పాగాల యాదవరెడ్డి, సిద్ధి నరసింహారెడ్డి పాల్గొన్నారు.