NRML: మండుటెండలో విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఏప్రిల్ నెలలో ఉదయం 8 దాటిందంటే 40 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎండలో విద్యార్థులతో ర్యాలీలు నిర్వహిస్తే వారి ఆరోగ్య పరిస్థితి ఏమవుతుంది అంటూ కలవర పడుతున్నారు. ప్రభుత్వం దీనిపై స్పందించాలని కోరారు.