వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నా సతీష్ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు వరంగల్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతి ఆరోపణలతో పాటు పలు కేసుల్లో విధుల పట్ల ఆలసత్వం చూపినట్లు విచారణలో నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ స్పష్టం చేశారు.