SRCL: అధిక ఉష్ణోగ్రతల నుంచి జాగ్రత్తలు వహిస్తూ విధులు నిర్వర్తించాలని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బీ గీతే అన్నారు. ఎస్పీ కార్యాలయంలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న అధికారులకు సిబ్బందికి ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా గురువారం కూలింగ్ గ్లాసెస్ అందజేశారు. తీవ్ర ఎండల సమయంలో విధులు నిర్వర్తించే సిబ్బంది తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు.