GDWL: మండలం మాచర్ల గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి వినతిపత్రం అందించారు. ఉన్నత చదువుల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లలేక పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వారు వివరించారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు.