KMR: బీర్కుర్ మండలం బైరాపూర్లో ప్రాథమిక సహకార సంఘం వద్ద ఆదివారం రైతులు నిరసనకు దిగారు. 15 రోజుల నుంచి నామమాత్రంగా కొనుగోలు సాగుతోందని రైతులు ఆరోపించారు. సిబ్బంది ఇతర గ్రామాలకు వెళ్లి వడ్లు తూకం నిర్వహిస్తున్నారని తెలిపారు. వాతావరణ మార్పుల వల్ల ధాన్యం తడిసే అవకాశం ఉందని వెంటనే కొనుగోలు వేగవంతం చేయాలని కోరారు.