ADB: గుడిహత్నూరు మండలంలోని కోలహరి గ్రామానికి చెందిన కాగ్నే కీర్తన ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఆధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ బాధిత కుటుంబ సభ్యులను శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా కీర్తన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.